Fifa World Cup 2022 : వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన ఫ్రాన్స్.. సెమీస్ లో మొరాకో చిత్తు

-

Fifa World Cup 2022 : ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ అదరగొట్టింది. మొరాకోతో జరిగిన కీలక మ్యాచ్ లో 2-0 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ అందుకు తగ్గ ఆట తీరును ప్రదర్శిస్తూ ఫైనల్ కు చేరింది.

ఇక డిసెంబర్ 18 అర్జెంటినాతో జరిగే ఫైనల్ లో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు గత ఏడు ఎడిషన్ లలో ఫ్రాన్స్ జట్టు నాలుగవసారి ప్రపంచకప్ ఫైనల్ కు చేరుకోవడం విశేషం. ఈ విజయంతో 2002లో బ్రెజిల్ తర్వాత వరుసగా ఫైనల్స్ కు చేరిన తొలి డిఫెండింగ్ ఛాంపియన్ గా ఫ్రాన్స్ నిలిచింది. ఇది ఇలా ఉండగా, రష్యాలో జరిగిన 2018 ప్రపంచ కప్ లో ఫ్రాన్స్ 4-2 తో క్రెయేషియాను ఓడించి విన్నర్ గా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version