చాహల్-ధనశ్రీ కి విడాకులు మంజూరు

-

టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ ధనశ్రీ వర్మ వివాహబంధానికి తెరపడింది. వీరికి ముంబైలోని ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేసింది. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 2022 నుంచి ఈ ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో 2025 ఫిబ్రవరి 5న ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. పరస్పర అంగీకారంతో ఈ జంట విడాకులు తీసుకోవాలని కోరుకోవడంతో ఆరు నెలల కూలింగ్ పీరియడ్ ను మినహాయించాలని ఫ్యామిలీ కోర్టును అభ్యర్థించగా.. అందుకు న్యాయ స్థానం ఒప్పుకోలేదు.

దీనిని సవాల్ చేస్తూ.. చాహల్ తరపు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించగా.. అందుకు న్యాయస్థానం పిటిషన్ దారులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 2022 నుంచే విడివిడిగా ఉన్నందున మళ్లీ ఆరు నెలల కూలింగ్ పీరియడ్ అవసరం లేదని తీర్పు వెల్లడించింది. మార్చి 20 లోపు విడాకుల అంశం పై తుది ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. దీంతో చాహల్-ధన శ్రీ జంటకు విడాకులు మంజూరు చేస్తూ ఇవాళ తుది తీర్పు వెలువరించింది ఫ్యామిలీ కోర్టు.

 

Read more RELATED
Recommended to you

Latest news