Pak : పాక్ జట్టులో ఆ ఐదుగురిని పీకేయండి !

-

T20 వరల్డ్ కప్ టోర్నీ నుండి పాకిస్థాన్ ఔట్ అయింది. దీంతో గ్రూప్ ఏ నుండి సూపర్ 8 కు చేరాయి భారత్, యు ఎస్ ఏ జట్లు. యూఎస్ఏ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ రద్దు అయింది. వర్షం కారణంగా రద్దయింది మ్యాచ్. దీంతో పాకిస్తాన్ ఆశలు గల్లంతు అయ్యాయి. అయితే…T20 WCలో పాకిస్తాన్ సూపర్-8కు అర్హత సాధించకపోవడంతో ఆ జట్టు మాజీ ప్లేయర్ అహ్మద్ షెహజాద్ మండిపడ్డారు.

former-pakistan-player-ahmed-shehzad-fumed-after-pakistans-failure-to-qualify-for-super-8-in-t20-wc

పాత జట్టులో ఐదుగురు ఆటగాళ్లను వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు. “నాలుగైదేఏళ్లుగా బాబర్, రిజ్వాన్, ఫకర్ జమాన్, షాహీన్ ఆఫ్రిది, హరీస్ రవుఫ్ రెగ్యులర్ గా ఆడుతున్నారు. వీరంతా వ్యక్తిగత రికార్డులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే పాక్ క్రికెట్ నాశనమైంది. వీరిని జట్టు నుంచి తప్పించాలి” అని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version