పారిస్లో జరగనున్న విశ్వ క్రీడలకు రంగం సిద్ధమవుతోంది. జులై 26న పారిస్ ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ తర్వాత తొలిసారి ప్రేక్షకుల మధ్య జరగనున్న ఈ ఒలింపిక్స్ కోసం ప్రపంచ క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్ చెఫ్ దే మిషన్గా షూటర్ గగన్ నారంగ్ నియమితులయ్యారు. భారత ఒలింపిక్స్ సంఘం బాక్చర్ మేరీ కోమ్ స్థానంలో నారంగ్ను ఎంపిక చేసింది. నారంగ్ గత ఒలింపిక్స్లో నాలుగు పథకాలు సాధించారు.
అలానే ఈ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో భారత జాతీయ పతాకాన్ని చేతపట్టి ముందు వరుసలో నడిచే గొప్ప అవకాశాన్ని పీవీ సింధు కూడా దక్కించుకుంది. భారత జట్టు తరఫున మహిళా ఫ్లాగ్ బేరర్గా సింధు వ్యవహరించనుండగా.. పురుషుల్లో శరత్ కమల్ కూడా ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉష వెల్లడించారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్లు రాణిస్తారన్న నమ్మకం తనకుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, సింధు ఇప్పటి వరకు రెండు ఒలింపిక్స్ పతకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.