పాకిస్తాన్ అస్సలు జట్టే కాదు…ఒక్కడూ మాట వినడు అంటూ పాక్ ప్రస్తుత హెడ్ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20 వరల్డ్ కప్ 2024లో మాజీ ఛాంపియన్స్ పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ మెగాటోర్నీ లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టడం మనం చూశాం.
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్ గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై మాజీ ఆటగాళ్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ జాబితాలో పాక్ ప్రస్తుత హెడ్ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ చేరిపోయారు. పాకిస్తాన్ క్రికెట్ టీం అసలు జట్టే కాదని…. పాక్ జట్టులో ఐక్యత లేదని మండిపడ్డారు పాక్ ప్రస్తుత హెడ్ కోచ్ గ్యారీ కిర్ స్టెన్. ఒకరికొకరు సపోర్ట్ గా లేరని… ఎవరికివారు నచ్చిన విధంగా ఉన్నారు. గ్రూపులుగా విడిపోయారు. నేను నా కెరీర్ లో చాలా జట్లతో కలిసి పనిచేశాను అంటూ విరుచుకుపడ్డారు కిర్ స్టెన్.