ఐపీఎల్ 2023 కు కౌంట్ డౌన్ షురూ అయింది. రేపటి నుంచే ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో 2008లో ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 15 సీజన్లు విజయవంతంగా ముగిశాయి.
రేపటి తొలి మ్యాచ్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్, ధోని కెప్టెన్సీ వహిస్తున్న చేత సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ టోర్నీలో పది టీమ్స్ 70 మ్యాచ్లు 52 రోజులపాటు ఆడనున్నాయి. దేశంలోని 12 స్టేడియాలలో ఈ ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇది ఇలా ఉండగా, ఐపిఎల్ 2023 సీజన్ లో ఈ సారి హైదరాబాద్ లో 7 మ్యాచ్ లు జరుగనున్నాయి. ఇక ఈ తొలి మ్యాచ్ లో పాండ్యా సేన విజయం సాధించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి.