మన శరీరం ఒక వయసు వరకు మాత్రమే దృడంగా మరియు ఫిట్ గా ఉంటుంది. కానీ లండన్ కు చెందిన బ్రియాన్ విన్స్లో అనే వృద్ధ పురుషుడు తన వయసును ఏ మాత్రం లెక్క చేయకుండా తనలో ఉన్న స్పోర్ట్స్ పర్సన్ ను బయటకు తీశాడు. తద్వారా ఈ మధ్యనే జరిగిన బ్రిటీష్ డ్రగ్ ఫ్రీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారు నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొని ప్రపంచ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు.
కాగా ప్రస్తుతం బ్రియాన్ వయసు 86 సంవత్సరాలు కావడం విశేషం. ఇతను 65 కేజీల విభాగంగా పోటి పడగా… ఎంతో సునాయాసంగా 75 కేజీలు మరియు 77.5 కేజీల బరువును ఎత్తేశాడు. ఇక ఇప్పటి వరకు ఈయన వయసులో ఎవ్వరూ ఇంతటి వెయిట్ ను ఎత్తలేదు.. కాబట్టి బ్రియాన్ జాతీయ మరియు ప్రపంచ రికార్డ్ లను నెలకొల్పాడు. ఈయన సక్సెస్ ఎందరికో స్ఫూర్తిదాయకం అని చెప్పాలి.