చివర్లో పుంజుకున్న ఆర్సీబీ.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?

-

ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతుంది. తొలుత ఆర్సీబీ కాస్త తడబడ్డప్పటికీ చివరికీ  కాస్త పుంజుకొని భారీ స్కోరు చేసింది. ఆర్సీబీ 20 ఓవర్లలో 169 పరుగులు చేసింది.  చివర్లో లివింగ్ స్టన్, టిమ్ డేవిడ్ కాస్త చక్కదిద్దారు. ప్రారంభంలో విరాట్ కోహ్లీ (7), సాల్ట్ (14), పడిక్కల్ (4), పటిదార్ (12) పరుగులు చేసి కాస్త నిరాశ పరిచారు. లివింగ్ స్టన్ 54 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

జితేష్ శర్మ(33), కృణాల్ పాండ్య కూడా 5 పరుగులు చేసి నిరాశ పరిచాడు. మహ్మద్ సిరాజ్ ఇవాళ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. 3 కీలక వికెట్లు తీశాడు. రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ 2 వికెట్లు తీశాడు. అర్షద్ ఖాన్ 1, ఇషాంత్ శర్మ 1 వికెట్ తీశారు. చివరి బంతికి ప్రసిద్ కృష్ణ అద్భుతమైన యార్కర్ వేసి టిమ్ డేవిడ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. భారీ సిక్స్ కొడతాడని అందరూ ఆశించగా.. బౌల్డ్ కావడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. 

Read more RELATED
Recommended to you

Latest news