Shivam Dube : హార్థిక పాండ్య ప్లేస్ ను భర్తీ చేస్తున్న దూబే ?

-

Shivam Dube : టీమిండియా జట్టులో హార్థిక పాండ్య ప్లేస్ ను భర్తీ చేస్తున్నాడు ఆల్ రౌండర్ శివమ్ దూబే.  AFGతో టీ20 సిరీస్ లో ఆల్ రౌండర్ శివమ్ దుబే వీరవిహారం చేస్తున్నారు. తొలి టీ20లో 60*, రెండో టీ20 లో 63* రన్స్ చేసి, భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు.

Hardik Pandya you need to come back soon, Otherwise Dube gonna make you history

బౌలింగ్ వేసి రెండు వికెట్లు కూడా పడగొట్టారు. దీంతో దూబేను ఈ ఏడాది జరిగే టీ20 WCకు తీసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మాటిమాటికి గాయాలపాలయ్యే హార్దిక్ పాండ్యా స్థానంలో ఇతడికి చోటివ్వాలని పోస్టులు చేస్తున్నారు.

ఇక అటు ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీం ఇండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతంగా రాణిస్తున్నారు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ కీలకమైన వికెట్లు పడగొడుతున్నారు. దీంతో అతనికి T20 WC టీమ్ లో చోటు దక్కడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కుల్దీప్, బిష్నోయ్, సుందర్ లతో పోల్చితే అతనికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన రెండు మ్యాచుల్లో అక్షర్ 23/2, 17/2తో రాణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version