Devara Movie : రిలీజ్ కాక‌ముందే ఓటీటీ ఫిక్స్ చేసుకున్న ‘దేవ‌ర’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘దేవర’. అలనాటి నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ ఎక్కడ రాజీ పడకుండా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 8న ఈ చిత్రం గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.

Devara OTT streaming partner and streaming languages is officially out Now

అయితే.. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో ‘దేవర’ పై భారీగా అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘దేవర త్వరలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ గా రాబోతోంది’ అని నెట్ ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. కాగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవి చందర్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version