బ్యాట్మెంటన్ గేమ్ ని ఎంతమంది ఆడతారు, ఎలా ఆడతారో తెలుసుకుందాం.. ఈ బ్యాట్మెంటన్ కోర్ట్ దీర్ఘచతురస్రాకార ఆట స్థలం యొక్క వ్యతిరేక సగాలలో స్థానం కలిగి ఉంటుంది. ఈ బ్యాట్మెంటన్ గేమ్ లో రెండు రకాల ఆటలు కలిగి ఉంటాయి. సింగిల్స్ లేదా డబుల్స్ . సింగిల్స్ అనగా కోర్టులో ఒకరు మరో ప్రత్యర్థి తో తలపడతారు. డబుల్స్ లో ఒక వైపున ఉన్న ఇద్దరు మరో వైపున ఉన్న ప్రత్యర్థులు ఇద్దరితో తలపడతారు. ఇది ఒక స్పీడ్ రాకెట్ లాంటి క్రీడ.
ఆటగాళ్లకు వారి ప్రత్యర్థులకు నడుమ ఒక వల ఏర్పాటు చేయబడి ఉంటుంది. గేమ్ లో వలను దాటి దీర్ఘ చతురస్రాకార క్రీడాస్థలం యొక్క ప్రత్యర్థి సగంలో క్రిందకి చేరే విధంగా షటిల్ కాక్ ని వారి యొక్క రాకెట్ తో కొట్టడం ద్వారా ఆటగాళ్లు పాయింట్లను సాధిస్తారు. వలపై నుండి వెళ్లేముందు ఒక్కొక్క పక్షం షటిల్ కాక్ ని ఒక్కసారి మాత్రమే కొట్టవలసి ఉంటుంది. ఒక్కసారి షటిల్ కాక్ నేలను తాకితే ఒక రాలి ముగుస్తుంది. ఇక షటిల్ కాక్ యొక్క ఆకాశ గమనం గాలి చేత ప్రభావితం అవుతుంది.
షటిల్ కార్ అనేది రాకెట్ క్రీడలలో ఉపయోగించే బంతులకు భిన్నంగా దాని అసమానమైన వాయు గతి లక్షణాల వల్ల వివిధ రకాలుగా ఎగిరే ఈకలు కలిగినటువంటి ఒక ప్రక్షేపకం. ఒక బంతి కంటే ఎక్కువ వేగంతో రుణత్వరణం చెందే విధంగా, ఈకలు అత్యంత అధికమైన కర్పణను కలిగిస్తాయి. షటిల్ కాక్ లు పైన అధిక వేగాన్ని కలిగి ఉంటాయి. ఒక సాధారణ కాలక్షేప కార్యకలాపంగా ఈ బ్యాడ్మింటన్ గేమ్ ని ఆరుబయట తరచుగా తోట లేదా సముద్రపు ఒడ్డున లేదా వీధుల్లో కూడా ఆడుతుంటారు.