శ్రీలంకకు గుడ్‌న్యూస్. శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సి)కి భారీ ఊరట దక్కింది. ఆ దేశ బోర్డుపై విధించిన సస్పెన్షన్ ను ఐసీసీ ఎత్తివేసింది. గత రెండు నెలల నుంచి లంక బోర్డు పరిస్థితులను నిషితంగా పరిశీలించిన ఇంటర్నేషనల్ బాడీ రాజకీయ జోక్యం లేదని నిర్ధారించుకుంది.
గత ఏడాది నవంబర్ 10న సస్పెన్షన్ వేటు వేయడంతో అండర్-19 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను లంక కోల్పోయింది. క్రమంలో 2026 టీ20 వరల్డ్ కప్ రైట్స్ కూడా చేజారుతాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పుడు సస్పెన్షన్ తొలగిపోవడంతో లంక బోర్డు యధావిధిగా ఇంటర్నేషనల్ షెడ్యూల్స్ ను మొదలుపెట్టనుంది.