ICC RANKINGS : ఒక్క సెంచరీతో ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన కోహ్లీ

-

ఆసియా కప్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై 101 పరుగులు తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో 61 బంధువుల్లోనే విరాట్ కోహ్లీ 122 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. దాదాపు మూడేళ్ల తర్వాత నమోదు చేసిన ఈ సెంచరీ లో 6 సిక్సర్లు మరియు 12 ఫోర్లు ఉన్నాయి. దీంతో మునుపటి కోహ్లీ గుర్తు చేశాడు. అయితే… దీనిపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు. ఆసియా కప్ తో పాటు తిరిగి ఫామ్ లోకి రావడం ఒక కారణం.

ఈ టోర్నీలో విరాట్ అయిదు మ్యాచ్లు ఆడగా, మొత్తంగా 276 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. ఇకపోతే ఆసియా కప్ లో అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో కోహ్లీ, ర్యాంకింగ్స్ రయ్ అని పైకి దూసుకొచ్చాడు. ఏకంగా 14 స్థానాలు ఎగబాకాడు. రోహిత్ పక్కకు వచ్చేసాడు. ప్రపంచ బ్యాటర్స్ ర్యాంకింగ్ లో 15వ స్థానానికి చేరుకున్నాడు.

ఈ జాబితాను ఐసీసీ విడుదల చేసింది. ఇంగ్లాండు పర్యటన తర్వాత దాదాపు నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోవడం, అంతకు ముందు కొన్నాళ్లపాటు భారీ స్కోర్లు చేయకపోవడంతో కోహ్లీ ర్యాంకు, ఏకంగా 29 కి పడిపోయింది. ఆసియా కప్ లో ఫామ్ లోకి వచ్చిన విరాట్, ర్యాంకుల వేటని మళ్లీ ఆరంభించాడు. ఆప్ఘన్ జట్టుపై భారీ సెంచరీ చేయడం, అంతకుముందు హాంకాంగ్, పాకిస్తాన్ హాఫ్ సెంచరీలు చేశాడు. టోర్నీలో రెండో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో ర్యాంకు మెరుగుపరచుకొని 15 కు చేరుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version