RRR: భీమ్​ అన్ ట్రిమ్డ్ ఇంట్రో షాట్.. వీడియో వైరల్!

-

ఎన్టీఆర్ ‌- రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి రూపొందించిన బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు ‘వావ్‌’ అనిపించేలా గ్రాండ్ లెవల్‌లో ఉంటాయి. హీరోలిద్దరి పరిచయ సన్నివేశాలు.. అందులోనూ తారక్‌ ఎంట్రీ సీన్‌ అయితే చెప్పడానికి మాటలు సరిపోవు. ఇక ఈ సినిమాలో రామరాజుగా చరణ్.. కొమురం భీంగా ఎన్టీఆర్​లు కనిపించారు.

అయితే ఇప్పుడు మేకర్స్ భీమ్ ఎంట్రీ షాట్​ అన్ ట్రిమ్డ్ వెర్షన్​ను రిలీజ్ చేశారు. దీనికి జస్ట్ రెండు, మూడు సెకండ్స్ మాత్రమే కలిపి ఉండగా.. ఇది సూపర్బగా ఉందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. భీమ్​ను నీటి ప్రతిబింబం నుంచి చూపించే షాట్​తో సినిమాలో చూపించారు. కానీ దాని కన్నా ముందు నీటిపై గ్రాఫికల్​గా ఓ తూనీగ వచ్చి.. ఆ తర్వాత అసలు షాట్ కనిపిస్తుంది. దీనితో ఈ కొత్త వీడియోని మేకర్స్ రిలీజ్ చేయ్యగా.. ఇది వైరల్​గా మారింది.

ఇక, ఆర్‌ఆర్‌ఆర్‌ విషయానికి వస్తే సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రామ్‌చరణ్‌ అల్లూరి సీతా రామరాజుగా, తారక్‌ కొమురం భీమ్‌గా మెప్పించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, జీ 5, నెట్‌ఫ్లిక్స్‌ వేదికలుగా అందుబాటులో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version