IND vs ENG 2nd Test: విశాఖ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ 336/6తో రెండోరోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ వైఫల్యం మధ్య ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆశలు కల్పించాడు.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో ద్విశతకం నమోదుచేశారు. మరోవైపు ఇవాళ తొలి సెషన్ ప్రారంభమైన కాసేపటికి అశ్విన్ (20) అవుట్ అయ్యారు. అటు ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్, అహ్మద్, అండర్‌సన్‌లకు తలో 3 వికెట్లు పడ్డాయి.