ప్రియాంక గాంధీని ఏ హోదాతో పిలుస్తారు. ఇంద్రవెల్లి మీటింగ్ కి అయిన ఖర్చు ఎంత అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రకటనలకు ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తుందని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఖర్చు చేయదన్నారు. ఇంద్రవెల్లిలో ప్రకటనలకు ఎంత ఖర్చు అయిందన్నారు. 60 రోజుల్లో ఒకే ఒక్క ప్రజాదర్భార్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
కుటుంబం కుటుంబం అని కేసీఆర్ కుటుంబం పై ఏడ్చే సీఎం రేవంత్ రెడ్డికి ఒక్కమాట చెబుతున్నాను. రాష్ట్రంలో 22 కుటుంబాల నుంచి అధికారికంగా ఏదో ఒక పదవీ ఇచ్చారని తెలిపారు. కోమటిరెడ్డి, గడ్డం వినోద్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా కుటుంబం 22 మంది గురించి చెప్పారు కవిత. సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు యూటర్న్ సీఎం అని పిలుస్తున్నారని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. సీఎం సోదరులు జిల్లా రివ్యూలో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. 60 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏముంది అని ప్రశ్నించారు కవిత.