ఇండియాలో కరోనా కలకలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ అశ్విన్ కు కూడా కరోనా సోకింది. దీంతో ఇండియా, ఇంగ్లండ్ 2022, 5వ టెస్ట్ మ్యాచ్ కోసం యూకేకు అశ్విన్ వెళ్లలేదు. అశ్విన్ కు కరోనా సోకడంతో.. ప్రస్తుతం అతనున క్వారంటైన్ లో ఉన్నారు. కరోనా తగ్గిన తర్వాత మాత్రమే స్వ్కాడ్ లో చేరతాడని టీమిండియా వర్గాలు తెలిపాయి.
టీమిండియా క్రికెట్ జట్టు ఈ నెల 16న యూకేకు బయలు దేరి వెళ్లింది. కరోనా సోకడంతో అశ్విన్ విమానంలో యూకేకు వెళ్ల లేకపోయారు. జూలై 1వ తేదీన టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయ్యే లోపపు అశ్విన్ కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
ఇది ఇలా ఉండగా.. ఇండియాలో ఫోర్త్ వేవ్ కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 12,781 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,16,088 కు చేరింది.
India allrounder R Ashwin has tested positive for Covid-19, and as a result, not yet travelled to England for the upcoming Edgbaston Test#ENGvIND
— ESPNcricinfo (@ESPNcricinfo) June 21, 2022