టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రమాదంలో పడ్డారు. గౌతమ్ గంభీర్ ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని సమాచారం అందుతుంది. భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను చంపేస్తామని కొంతమంది బెదిరింపులకు దిగుతున్నారు. ఐసిస్ జమ్మూ కాశ్మీర్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు…. ఢిల్లీ పోలీసులకు గౌతమ్ గంభీర్ స్వయంగా ఫిర్యాదు చేయడం జరిగింది. తనకు వెంటనే భద్రత కల్పించాలని పోలీసులను కోరారు గౌతమ్ గంభీర్.

తనతో పాటు తన కుటుంబానికి కూడా ప్రమాదం పొంచి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఈ బెదిరింపులు చేసింది ఉగ్రవాదులు అయి ఉంటుందని… అధికారులు అంచనా వేస్తున్నారు. జమ్ము కాశ్మీర్లో మొన్న ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 28 మంది యాత్రికులు మరణించారు. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు రావడం.. కలకలం సృష్టిస్తోంది. దింతో వెంటనే ఢిల్లీ పోలీసులు.. గౌతమ్ గంభీర్ కు సెక్యూరిటీ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు.