కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ మలిదశ విచారణ జరుగనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై విచారణ చేపట్టన్నారు జస్టిస్ ఘోష్. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియనుంది. మరో రెండు నెలలు గడువు పొడిగించే ఛాన్స్ ఉంది.

ఇది ఇలా ఉండగా ఏప్రిల్ 27వ తేదీన గులాబీ పార్టీకి సంబంధించిన భారీ బహిరంగ సభ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సభను అడ్డుకునేందుకు… రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలేశ్వరం విచారణ పేరుతో… కొత్త కుట్రలు చేస్తోందని గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు సభ జరగకుండా అడ్డుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం… ఇప్పుడు కాళేశ్వరం విచారణ అంటుందని.. ఫైర్ అవుతున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సభ జరుగుతుందన్నారు.