శ్రీనగర్‌లో చిక్కుకు పోయిన 80 మంది తెలంగాణ టూరిస్టులు

-

80 మంది తెలంగాణ టూరిస్టులు శ్రీనగర్‌లో చిక్కుకు పోయారు. తమను వెంటనే కాపాడాలని 80 మంది తెలంగాణ టూరిస్టులు వేడుకుంటున్నారు. అయితే , 80 మంది తెలంగాణ టూరిస్టులు శ్రీనగర్‌లో చిక్కుకున్న తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  స్పందించారు. టూరిస్టులు సురక్షితంగా తిరిగి రావడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు త్వరగా ఏర్పాట్లు చేయాలని కోరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Pahalgam attack leaves Telangana tourists stranded in Kashmir

కాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడికి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రదాడి నుండి 11 మందిని కాపాడాడు కాశ్మీరీ వ్యాపారి నజాకత్ అలీ. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివాంశ్ జైన్, అరవింద్ అగర్వాల్, హ్యాపీ వాధవన్ మరియు కుల్దీప్ స్థపక్‌ల కుటుంబ సభ్యులు 11 మంది విహారయాత్రకు పహల్గాంకు వెళ్లారు. అక్కడ వారికి పరిచయం ఉన్న స్థానిక బట్టల వ్యాపారి నజాకత్ అలీ అక్కడి ప్రదేశాలు చూపిస్తుండగా ఉగ్రదాడి జరిగింది. స్థానికుడైన నజాకత్ అలీ చాకచక్యంగా ఉగ్రదాడి నుండి తప్పించి, తనకు తెలిసిన సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లి 11 మందిని కాపాడాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news