ఉప్పల్ టెస్ట్ లో భారత జట్టు ఓటమికి విశాఖ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. బుమ్ బుమ్ బుమ్రా రెండు ఇన్నింగ్స్ లో కలిపి 9 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా 3, అశ్విన్ మూడు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా 6 వికెట్లు తీసి టీమిండియా విజయానికి తోడ్పడాడు.
రెండో ఇన్నింగ్స్ లో 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 292 పరుగులు చేసింది. దీంతో టీమిండియా 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టెస్ట్ లో యువ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్ 209, శుభ్ మన్ గిల్ 101 పరుగులతో సత్తా చాటారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలే రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 149 పరుగులో రాణించగా.. మిగతా ఆటగాళ్లు ఎవ్వరూ కూడా అంతగా పరుగులు చేయలేకపోయారు. ముఖ్యంగా భారత బౌలర్ బుమ్రా పరుగుల కట్టడి చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బంతితో నిప్పులు చెరిగాడు. టీమిండియా విజయంతో ఐదు టెస్టుల సిరీస్ 1-1 సమం అయింది.