పారిస్ ఒలింపిక్స్‌ 2024.. ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా మనికా బాత్రా రికార్డు

-

పారిస్ ఒలింపిక్స్లో భారతీయులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే షూటింగ్లో మను బాకర్ కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ ఒలింపిక్స్లో టెబుల్‌ టెన్నిస్‌ స్టార్ మనికా బాత్రా కూడా తన హవా చాటుతోంది. ఈ ఆమె వేదికగా ఓ అరుదైన రికార్డును నమోదు చేసింది. తాజాగా జరిగిన మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో రౌండ్‌ 16లోకి దూసుకెళ్లింది. ఒలింపిక్స్‌లో రౌండ్‌ 16లోకి చేరుకున్న తొలి భారత క్రీడాకారిణిగా మనికా రికార్డు క్రియేట్ చేసింది.

రౌండ్‌ 32లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ 18వ ర్యాంకర్‌ ప్రీతికా పవడేతో జరిగిన మ్యాచ్‌లో బాత్రా 11-9, 11-6, 11-9, 11-7 తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థికి ఛాన్స్ ఏ ఇవ్వలేదు. ఒక్క సెట్టు కూడా కోల్పోకుండా 4-0 తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం ప్రపంచ 28వ ర్యాంక్‌లో ఉన్న బాత్రా, ప్రీక్వార్టర్‌ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన ఎనిమిదో సీడ్‌ మియూ హిరానోతో లేకుంటే హాంకాంగ్‌ ప్లేయర్ జు చెంగ్జూతో తలపడనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version