ఆరేళ్లలో ఏడు పెళ్లిళ్లు.. మహిళపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

-

తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ ఓ మహిళ (32) చేసుకున్న దరఖాస్తును చూసి కర్ణాటక రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. డబ్బు సంపాదనకే శ్రీమంతులను చూసి వివాహం చేసుకోవడం, అనంతరం ఏదో ఒక సాకు చెప్పి విడాకులు తీసుకోవడం చేస్తోందని సదరు మహిళ ఏడో భర్త న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆమె మోసం బయటపడింది.

ఆరేళ్లలో ఆరుగురు భర్తలను మార్చిన ఆమె.. వివాహమైన ఆరు నెలల అనంతరం తనను భర్త, అత్తింటి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ గృహహింస కింద కేసులు పెట్టేదని బాధితుడు కోర్టుకు తెలిపారు. వారు రాజీ పడి, పెద్ద మొత్తంలో నగదు ఇచ్చి తప్పుకొనేవారని పేర్కొన్నారు. తాజాగా ఆ మహిళ ఏడో భర్తపైనా మళ్లీ కేసు పెట్టడటంతో ఆ మహిళ తీరును హైకోర్టు న్యాయమూర్తి ఖండించారు. ఏ భర్తతోనూ ఎక్కువ రోజులు కలిసి ఉండకపోవడమంటే.. అందులో మీ తప్పే కనిపిస్తోందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 21వ తేదీకి వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version