టీమిండియా కోసం స్పెషల్ ఫ్లైట్ సెట్ చేసింది బీసీసీఐ. దీంతో బార్బడోస్ నుంచి టీమిండియా.. భారత్ కు చేరుకోనుంది. తుపాను వల్ల భారత జట్టు బార్బడోస్‌లో చిక్కుకుంది. ఇక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తుపాను హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్తతో అక్కడి అధికార యంత్రాంగం బార్బడోస్ విమానాశ్రయాన్ని మూసివేసింది.
దీంతో ఆటగాళ్లందరూ హోటల్ గదుల్లోనే ఉండి పోయారు. అయితే… బార్బడోస్ లో వాతావరణ పరిస్థితులు కాస్త మెరుగు కావడంతో… టీమిండియా కోసం స్పెషల్ ఫ్లైట్ సెట్ చేసింది బీసీసీఐ. ఇవాళ సాయంత్రం 6 గంటలకు స్పెషల్ ఫ్లైట్ లో బార్బడోస్ నుంచి టీమిండియా.. భారత్ కు చేరుకోనుంది. రేపు ఉదయం ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ రానుంది.