ఐపీఎల్ 2023: సన్ రైజర్స్ బ్యాటింగ్… దీపక్ హుడాపై వేటు వేసిన లక్నో !

-

రాజీవ్ గాంధీ స్టేడియం లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు లక్నో సూపర్ జయింట్స్ ల మధ్యన మ్యాచ్ జరగనుంది. ఇందులో మొదటగా టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ మార్ క్రామ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితిని బట్టి బ్యాటింగ్ ఎంచుకున్నట్లుగా ఇతను చెప్పాడు. కాగా ఈ పిచ్ పైన బ్యాటింగ్ ఈజీ గా ఉంటుందని కామెంటేటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఛేజింగ్ చేయనున్న లక్నో సూపర్ జయింట్స్ వన్ డౌన్ లో బ్యాటింగ్ చేసే దీపక్ హోదా పై వేటు వేసింది. ఈ సీజన్ లో వరుస అవకాశాలను ఇస్తున్న ఇప్పటికి ఒక్క ఇన్నింగ్స్ ను కూడా లక్నో కు ఫేవర్ గా ఆడింది లేదు. అందుకే ఇతనిని తుది జట్టు నుండి తప్పించింది.

కాగా ఇంపాక్ట్ ప్లేయర్ ల లిస్ట్ లో మాత్రం దీపక్ ఉన్నాడు, అయినా అవకాశం ఇస్తారా అంటే సందేహమే. మరి ఈమ్యాచ్ లో ఇద్దరూ తప్పక గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి హోరాహోరీగా ఉండనుంది. మరి ఫలితం ఎవరికి అనుకూలంగా వస్తుందో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version