కమలంలో సీటు రేసు.. గెలిచేదెవరు?

-

తెలంగాణలో పట్టు సాధించి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తున్న బీజేపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీకి పూర్తిగా రాష్ట్ర స్థాయిలో బలం లేదనే అంశం పలు సర్వేలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలో 119 స్థానాలు ఉంటే..అందులో 50 స్థానాల వరకే బి‌జే‌పికి బలమైన అభ్యర్ధులు ఉన్నారని, మిగతా స్థానాల్లో బలమైన అభ్యర్ధులు కావాలని సర్వేలు చెబుతున్నాయి.

దీంతో వేరే పార్టీల నుంచి బలమైన నాయకులని లాగాలని బి‌జే‌పి చూస్తుంది. అయితే ఓ వైపు కొన్ని చోట్ల సరిగ్గా అభ్యర్ధులు లేరు అనుకుంటే.. మరికొన్ని చోట్ల ఒక సీటు కోసమే ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. బి‌జే‌పికి కాస్త పట్టున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అదే పరిస్తితి ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ సీటుని బి‌జే‌పి గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ బి‌జే‌పికి నిదానంగా పట్టు పెరుగుతుంది. ఈ క్రమంలో అక్కడ సీట్ల కోసం నేతల మధ్య పోటీ పెరిగింది.

 

అక్కడ బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ లతో పాటు బి‌జే‌పి బలపడింది గాని..అదే స్థాయిలో సీట్ల కోసం నేతల మధ్య పోటీ ఉంది. అక్కడ బి‌జే‌పికి పట్టున్న ఖానాపూర్ సీటులో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, జెడ్‌పి‌టి‌సి జాను భాయి, హరి నాయక్..ఈ ముగ్గురు ఖానాపూర్ సీటు కోసం పోటీ పడుతున్నారు. ఇక ముధోల్ సీటు కోసం పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, మోహన్ రావు పటేల్ పోటీ పడుతున్నారు.

నిర్మల్ సీటులో ఇటీవలే కాంగ్రెస్ లో నుంచి వచ్చిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉండగా, అక్కడ బి‌జే‌పి నేత గణేశ్ చక్రవర్తి, మల్లిఖార్జున్ రెడ్డి సైతం అదే సీటు కోసం పట్టుబడుతున్నారు. ఆదిలాబాద్ సీటు లో సుహాసిని రెడ్డి, పాయల శంకర్.. ఈ ఇద్దరు పోటీ పడుతున్నారు. మంచిర్యాల సీటులో రఘునాథ్, ఒక ఎన్‌ఆర్‌ఐ రేసులో ఉన్నట్లు తెలిసింది. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు లాంటి సీట్లలో కూడా పోటీ ఉంది. మరి ఇలా పోటీ పడటం వల్ల బి‌జే‌పికి నష్టమో..లాభమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version