IPL 2024 Shashank Singh : ఐపీఎల్ 2024 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 17 మ్యాచ్లు పూర్తయ్యాయి. అయితే గురువారం రోజున గుజరాత్ వర్సెస్ పంజాబ్ కిమ్స్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో మూడు వికెట్ల తేడాలతో పంజాబ్ జట్టు విజయం సాధించింది.

పంజాబ్ బ్యాట్స్మెన్ శశాంక్ సింగ్ అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో ఉత్కంఠ మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించింది. మొదలు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. గిల్ 89 పరుగులు చేశారు. అయితే ఆ లక్ష్యాన్ని ఒక బంతి మిగిలి ఉండగానే పంజాబ్ జట్టు చేదించింది. ఈ తరుణంలోనే ఐపిఎల్ 2024 టోర్నమెంట్లో రెండవ విజయాన్ని సొంతం చేసుకుంది పంజాబ్ కింగ్స్.