ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి చివరి వారంలో ప్రారంభం అవుతుంది. ఈ టోర్నీని ముందుగా భారత్ లోనే నిర్వహించాలని అనుకున్నారు. కానీ లోక్ సభ ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు ఐపీఎల్ వేదికపై సందిగ్ధత నెలకొంది. 2009 సంవత్సరం లోక్ సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్ ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2014లో ఎన్నికలు ఉన్నప్పటికీ భారత్ లోనే ఐపిఎల్ ను కొనసాగించారు. ఇప్పుడు మాత్రం ఐపీఎల్ ను స్వదేశంలో నిర్వహించాలా? విదేశానికి తరలించాలా? అని బీసీసీఐ లెక్కలు వేసుకుంది.
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ని బట్టి తుది నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే ముందు నుంచే ఐపీఎల్ ను భారత్ లోనే నిర్వహిస్తామని బీసీసీఐ చెప్పుకొచ్చింది. పైగా బీసీసీఐలో అమిత్ షా కొడుకు జైషా ఉండడంతో ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని అందరూ ఊహించారు. కానీ ఇప్పుడు బీసీసీఐ ఐపీఎల్ పై ఆందోళన చెందుతోంది.
ముందు నుంచి చెప్పిన చెప్పినంత ధైర్యంగా ఇప్పుడు వేదికపై క్లారిటీ ఇవ్వలేకపోతోంది. అందువల్ల ఎన్నికల షెడ్యూల్ తర్వాతే ఈ విషయంపై స్పష్టత రానుంది. ఇది ఇలా ఉండగా…. ఐపీఎల్ వేదికపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల ఆసక్తికర వాక్యాలు చేశాడు. ఐపీఎల్ వేదిక గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం. ఐపీఎల్ వేదికను మార్చాలా? వద్దా? అనే విషయంపై భారత ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖలతో చర్చలు ముగిసిన తర్వాతే వేదికను ప్రకటిస్తామని శుక్లా తెలిపారు.