ఐసీసీ నూతన చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన జైషా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. భారత్ నుంచి ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జైషా ఐదో వ్యక్తి కావడం విశేషం. రెండేళ్ల పాటు ఈపదవీలో కొనసాగనున్నారు జైషా. ఐసీసీ చైర్మన్ ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా జైషా (36) గుర్తింపు దక్కించుకున్నారు. చివరగా భారత్ నుంచి శశాంక్ మనోహర్ 2015-20 మధ్య ఈ పదవీలో కొనసాగారు.
ఐసీసీ చైర్మన్ గా జైషా పదవీ కాలం రెండు సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే మూడు సార్లు రెండేళ్ల పాటు ఐసీసీ చైర్మన్ గా ఉండవచ్చు. గరిష్టంగా ఆరేళ్ల పాటు కొనసాగవచ్చు. గతంలో ఎన్. శ్రీనివాసన్ 2014 నుంచి 2015 మధ్య ఏడాది పాటు భారత్ నుంచి ఐసీసీ చైర్మన్ గా కొనసాగారు. ఆ తరువాత శశాంక్ మనోహర్ 2015 నవంబర్ నుంచి జూన్ 2020 వరకు నాలుగేళ్లకు పైగా ఐసీసీ చైర్మన్ గా ఉన్నారు. వీరిద్దరూ కూడా భారతీయులు కావడం విశేషం.