తెలంగాణ రైతులకు రైతుబంధు ఎగ్గోట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పరిశ్రమల కోసం లగచర్లలో ఎప్పుడో భూములను గుర్తించామని తెలిపారు. ఇప్పుడు కొత్తగా భూములు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. పాలమూరు పచ్చగానే ఉందని.. ఇప్పుడు వలసలు లేవని పేర్కొన్నారు.
ప్రజలు మళ్లీ వసల వెళ్లే పరిస్థితిని తీసుకురావద్దని తెలిపారు. రూ.7,500 కోట్ల రైతు బంధు ఇవ్వలేక చేతులెత్తేశారు. వారికి రూ.30వేల కోట్ల బోనస్ ఎలా ఇస్తారు..? రైతు బంధు ఎగవేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. ఎంత మందికి బోనస్ ఇచ్చారు..? కేసీఆర్ హయాంలో ఎన్ కౌంటర్లు అనేవే లేవు. వాటిని మళ్లీ ఎందుకు పునరుద్ధరించారు అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.