కాకినాడ పోర్టు పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న మాటల్లో తప్పేముందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. గత ప్రభుత్వం పై విమర్శలు చేసారు. ఈ సందర్భంగా ఎందుకు కాకినాడ పోర్టు పై దృష్టి సాధించడం అనేది అందరూ తెలుసుకోవాలని.. గత ఐదేళ్లలో ఎవరిని పోర్టు లోపలికి అనుమతించలేదని తెలిపారు లోపల ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎటువంటి బోట్లు వస్తున్నాయి అధికారులు ఎవరెవరున్నారని తెలుసుకోవడానికి కనీసం మీడియా వారిని కూడా అనుమతించలేదని చెప్పారు.
కాకినాడ పోర్టు నుంచి గత మూడేళ్లలో దుర్మార్గంగా 1,31,18,346 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయ్యాయని స్పష్టం చేశారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం సరఫరా చేయమని ఆదేశాలు ఇస్తే.. దాదాపు 6300 కోట్ల రూపాయల బియ్యం లెక్కలు చూపించి ఇక్కడ నుంచి తరలించేశారని.. ప్రభుత్వానికి ప్రతి కిలోకి 43.40 ఖర్చయ్య బియ్యాన్ని వీళ్లు క్షేత్రస్థాయిలో పది రూపాయలకే తీసుకొని వెళ్ళిపోవడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ మాటల్లో తప్పేముందని దేశభద్రతను కూడా గత ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. రేపు అక్కడి నుంచి గంజాయి స్మగ్లింగ్ జరగదని రూల్ ఉందా అని ప్రశ్నించారు.