బుమ్రా సర్జరీ సక్సెస్.. కోలుకునేందుకు 6 నెలలు!

-

టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా సర్జరీ విజయవంతంగా పూర్తయింది. గత సెప్టెంబర్ నుంచి వెన్ను నొప్పితో బాధపడుతున్న అతడికి న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ లోని ఓ ఆసుపత్రిలో సర్జరీ చేశారు. బుమ్రా ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్లు వెల్లడించారు.

అతడు కోలుకునేందుకు 6 నెలలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో బుమ్రా ఐపిఎల్ తో పాటు ఆసియా కప్-2023 కు దూరం కానున్నాడు. వన్డే WC లో బరిలోకి దిగనున్నాడు. కాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ప్రీమియర్ లీగ్ ‘ఐపీఎల్’. ఈ ఐపీఎల్‌ లీగ్‌ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్‌ ఫ్యాన్స్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ గాయం కారణంగా  పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2023 సీజన్ కు దూరం కానున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version