ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో భాగంగా… ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య ఇవాళ బిగ్ ఫైట్ జరగనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇక ఇందులో టాస్ గెలిచిన… కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

దీంతో లక్నో సూపర్ జెంట్స్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తోంది. ఇక ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెంట్స్ జట్టు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అటు కేకేఆర్ ఇప్పటికే హైదరాబాద్ జట్టు పైన మొన్న విజయం సాధించి మంచి ఊపులో ఉంది. దానికి తోడు ఈడెన్ గార్డెన్స్ వాళ్ళ సొంత గ్రౌండ్. కాబట్టి కేకేఆర్ జట్టుకు మంచి అడ్వాంటేజ్ కూడా… ఉంటుంది. మరి అడ్వాంటేజ్ వాడుకొని కేకేఆర్ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.