ఈసారి ఐపీఎల్ సీజన్‌ను పేలవంగా ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని ఏకంగా ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఫస్టాప్‌లో వరుస ఓటములతో డీలాపడ్డ ఆ జట్టు.. సెకండాప్‌లో అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా ఆరు విజయాలు సాధించి ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తో ఆర్‌సీబీ తలపడనుంది. ఇందులో గెలిస్తే క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్‌తో ఆడనుంది.
విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ బెంగళూరు జట్టును ఈ స్థాయికి చేర్చిందనడంలో సందేహం లేదు. ఈసారి కింగ్ కోహ్లీ భీకరమైన ఫామ్‌తో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 14 మ్యాచులు ఆడిన విరాట్ 708 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్‌తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక రన్ మెషీన్ 150కి పైగా స్ట్రైక్‌రేటుతో చేసిన 708 రన్స్‌లో 5 అర్ధ శతకాలు, ఒక శతకం కూడా ఉన్నాయి. ఈ గణాంకాలను చూస్తే విరాట్ ఆర్‌సీబీ బ్యాటింగ్ విభాగానికి వెన్నెముక లాంటోడని అర్థమవుతోంది. ప్రతి మ్యాచులో అతని నిలకడైన బ్యాటింగ్ ఆ జట్టుకు బాగా కలిసొస్తుంది. ఇక ఈసారి దూకుడుగా ఆడుతున్న కోహ్లీని ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. తన రికార్డును తానే బ్రేక్ చేసుకునే ఛాన్స్ ఉంది.