రివైండ్ 2024: పడి లేచిన కెరటాల మాదిరి కం బ్యాక్ ఇచ్చిన క్రీడాకారులు

-

క్రీడాకారులు ఎప్పుడూ ఒకే రకమైన ఫామ్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. శారీరకంగా ఎంత ఫిట్ గా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని అనుకోని సంఘటన వల్ల ఫామ్ కోల్పోవడం, లేకపోతే క్రీడలనుండి దూరం కావడం జరుగుతుంది. అలా అనుకోని కారణాల వల్ల ఆటలకు దూరమై తిరిగి ఈ సంవత్సరంలో కంబ్యాక్ ఇచ్చిన క్రీడాకారుల గురించి తెలుసుకుందాం.

రిషబ్ పంత్:

ఈ లిస్టులో భారతీయ క్రికెట్ ఆటగాడు రిషబ్ పంత్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఎందుకంటే.. 2022 డిసెంబర్లో రిషబ్ పంత్ కి కార్ యాక్సిడెంట్ అయ్యి అనేక గాయాలు అయ్యాయి. ఆ టైంలో చాలామంది రిషబ్ పంత్ ఇక క్రికెట్ ఆడలేడేమో అని అన్నారు.
వారి నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ 2024లో మైదానంలోకి అడుగు పెట్టాడు రిషబ్.

మనూ భాకర్:

2020 టోక్యో ఒలంపిక్స్ లో షూటింగ్‍లో ఆమె పతకాన్ని అందుకోలేకపోయింది. ఆమె పిస్టల్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల పోటీలో నిలవలేకపోయింది. అయితే 2024 పారిస్ ఒలింపిక్స్ లో టెన్ మీటర్స్ రైఫిల్ పిస్టల్ షూటింగ్‍లో కాంస్య పతకాన్ని అందుకుంది మనూ భాకర్.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ):

ఐపీఎల్ లో ఈ సంవత్సరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. వాళ్లు కప్ సాధించకపోయినప్పటికీ.. ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకోగలిగారు. మొదటి ఎనిమిది మ్యాచుల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఆ తర్వాత మ్యాచుల్లో అరుదైన ప్రదర్శన కనబరుస్తూ క్వాలిఫైయర్ లోకి అడుగు పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news