పండంటి బిడ్డకు జన్మనించిన మరియా షరపోవా !

-

మాజీ ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ తార శరపోవా తల్లి అయ్యారు. ఇటీవల ఆమె తన బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసి తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా తాను తల్లి అయినట్లు ఆమె ప్రకటించింది. తన భర్త అలెగ్జాండర్ గిల్క్స్ తో తాను కుమారుడికి జన్మనిచ్చినట్లు ఆమె ప్రకటించింది.

అప్పుడే పుట్టిన తన చిన్నారి, తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కుమారుడు పేరు కూడా ఆమె ప్రకటించారు. తమ ముద్దుల కుమారుడికి థియేడర్ అనే పేరు పెట్టినట్టు ఆమె తెలిపింది.

రెండేళ్లపాడు డేటింగ్ చేసిన ఈ జంట 2020లో నిశ్చితార్థం చేసుకుంది. ఏప్రిల్ 19వ తేదీన తన 35వ పుట్టినరోజు సందర్భంగా… తాను గర్భవతిని అంటూ ప్రకటించారు. త్వరలోనే తమ కుటుంబంలోకి మరొకరు రాబోతున్నట్లు ఆమె తెలిపారు. కాగా ఫిబ్రవరి 2020లో ఆస్ట్రేలియా ఓపెన్ ఆడిన తర్వాత టెన్నిస్ ప్రపంచానికి ఆమె వీడుకోలు పడింది. ఆమె రిటర్మెంట్ పట్ల అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version