నేడు ఈడీ ముందుకు HCA మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్..!

-

ఈ రోజు ఈడీ ముందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, మాజీ భారత కెప్టెన్ అజారుద్దీన్ హాజరు కానున్నారు. గతంలో ఉప్పల్ పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడి. 2020 – 2023 మధ్యలో హెచ్సీఏలో జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. మొత్తం 3.8 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి.

క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలు లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు అధికారులు. ఇదే వ్యవహారంలో ముందస్తు బెయిల్ తీసుకున్నారు అజారుద్దీన్. కానీ ఈ కేసులో తాజాగా అజారుద్దీన్ కు నోటీసులు జారీ చేసింది ఈడి. దాంతో ఈరోజు విచారణ కు హాజరు కానున్నారు అజారుద్దీన్. అయితే అజారుద్దీన్ న్యాయకత్వంలో HCA పై ఎన్నో విషయాలు వచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version