రెచ్చిపోయిన ఆర్సీబీ బ్యాటర్లు.. ముంబై టార్గెట్ ఎంతంటే..?

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది.  ఆర్సీబీ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్ లో బౌల్ట్ వేసిన తొలి బంతికి ఫోర్ బాదిన సాల్ట్.. ఆ తరువాత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

 

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 67 పరుగులు చేశాడు. తన టీ20 క్రికెట్ కెరీర్ లో 13వేల పరుగులు దాటేశాడు. మరోవైపు బుమ్రా, హార్దిక్ పాండ్యా ఆర్సీబీ చేస్తున్నటువంటి పరుగులకు కళ్లెం వేశారు. కానీ హార్దిక్ పాండ్యా 17వ ఓవర్ లో భారీ పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్ లో రజత్ పటిదార్ రెండు సిక్స్ లు, ఒక ఫోర్ కొట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు పటిదార్. 64 పరుగులు చేశాడు.   హార్దిక్ వేసిన ఓవర్లో 23 పరుగులు రావడం విశేషం. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆర్సీబీ జట్టు 221 పరుగులు చేసింది. దీంతో ముంబై టార్గెట్ 222 పరుగులు.

Read more RELATED
Recommended to you

Latest news