అంతర్జాతీయ వేదికలపై భారత్ స్టార్ జావెలిన్ త్రోయర్, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా తన సత్తా చాటుతున్నాడు. ఆట ఆటకూ తన ప్రదర్శనను మెరుగు పరుచుకుంటూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. రెండేళ్ల కిందట టోక్యో ఒలింపిక్స్, డైమండ్ లీగ్ ఫైనల్లో గోల్డ్ మెడల్‌తో మెరిసిన నీరజ్.. తాజాగా మరో ఘన విజయం సాధించాడు. దోహలో జరుగుతున్న డైమండ్ లీగ్ కొత్త సీజన్‌లో తొలి అంచె టోర్నీలో అదిరే ప్రదర్శనతో టైటిల్‌ను ముద్దాడాడు.
శుక్రవారం జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెను అత్యుత్తమంగా 88.67 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు నీరజ్. తొలి త్రోలోనే 88.67 మీటర్ల దూరాన్ని అందుకుని అగ్రస్థానం సాధించిన అతడు.. ఈ సీజన్లో బెస్ట్ త్రో వేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2, 3 త్రోలలో 86.04 మీ, 85.47 మీ. దూరం విసిరాడు.
నాలుగో ప్రయత్నంలో ఫౌల్ చేసిన భారత స్టార్.. 5, 6 ప్రయత్నాల్లో 84.37 మీ, 86.52 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్‌ను ఖాయం చేసుకున్నాడు. అయితే టైటిల్‌ను సాధించినప్పటికీ నీరజ్.. తాను అనుకున్న 90 మీటర్ల లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయాడు.
India's pride @Neeraj_chopra1 makes nation proud again at the prestigious #DohaDiamondLeague with a throw of 88.67 meters.
Congratulations #NeerajChopra 🇮🇳 pic.twitter.com/1gbWFiRfK2— Kiren Rijiju (@KirenRijiju) May 5, 2023