గంగూలీకి షాక్.. బీసీసీఐ కొత్త అధ్యక్షుడుగా మరో వ్యక్తి !

-

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరబ్ గంగూలీ ఇంకొన్ని రోజులు కొనసాగనున్నాడు. ఈ నేపథ్యంలోనే  గంగూలీకి షాక్ తగిలింది.  తిరిగి అతడు అధ్యక్ష రేసులో పోటీపడే అవకాశాలు లేనట్లే. మరి అతడి స్థానం ఎవరిది అన్నదానిపై ఇప్పటికే బోర్డు సీనియర్లు ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది.

1983 ప్రపంచ కప్ హీరో రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడు కావచ్చు అని సమాచారం. ఈనెల 18న జరిగే ఎన్నికలు, వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొనే ఓటర్ల జాబితాలో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం తరపున బిన్నీ పేరు ఉండటమే ఇందుకు కారణం. గతంలో కే ఎస్ సి ఏ కార్యదర్శి సంతోష్ మేనన్ బోర్డు ఏజీఎం లో పాల్గొన్నారు. కొత్త కార్యవర్గంలో ఎవరు ఉండాలి అన్న విషయంలో ఢిల్లీలో కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version