రంగులు మార్చే ఊసరవెళ్లికే నితీశ్ పోటీ.. జైరాం రమేష్ సెటైర్లు..!

-

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని అద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమిలో కీలకపాత్ర పోషించిన బీహార్ సీఎం నితీష్ కుమార్..  పార్లమెంట్ ఎన్నికలవేళ కూటమికి బిగ్ షాక్ ఇచ్చారు. ఇండియా కూటమికి చెప్పి.. మరోసారి పాత ఫ్రెండ్ అయినా ఎన్డీఏ కూటమిలో చేరారు. కాంగ్రెస్ ఆర్జేడి నేతృత్వంలో మహాగట్టు బంధన్ కూటమి ప్రభుత్వాన్ని కూలగొట్టి బిజెపితో కలిసి నూతన ప్రభుత్వ ఏర్పాటుకు నితీష్ కుమార్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఇవాళ సీఎం పదవికి రాజీనామా చేశారు నితీష్ కుమార్.

బీజేపీ మద్దతుతో మళ్లీ ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటానికి హ్యాండ్ ఇచ్చిన నితీష్ కుమార్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా సీఎం నితీష్ కుమార్ పై కాంగ్రెస్ అగ్ర నేత జయరాం రమేష్ విమర్శలు చేశారు. అవసరాన్ని బట్టి రాజకీయ భాగస్వాములను మార్చడం నితీష్ కుమార్ కు అలవాటే అని విమర్శించారు. నితీష్ కుమార్ క్షణాల్లో రంగులు మార్చే ఊసరవెల్లికే పోటీ ఇస్తున్నారని సెటైర్ వేశారు. సిద్ధాంతాలను ఆశయాలను వదిలేసి రాజకీయ అవసరాల కోసం పార్టీలు మారే ద్రోహులను బీహార్ ప్రజలు ఎప్పటికీ క్షమించరని  ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version