ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అబద్ధాలు నేడు పాలనలో అసహనం స్పష్టంగా కనిపిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ చెప్పారు. మెదక్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన ఆరుగారెంటీలో భాగంగా రాష్ట్రంలోని 1.5 కోట్లు ఆడపడుచులు ఉన్నారని అందరికీ నెలకి 2500 ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ అని అడిగారు. మార్చి 17తో కాంగ్రెస్ పాలానికి వంద రోజులు పూర్తి అవుతాయి అన్నారు.
ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు ఉంటాయని ఆ లోగా ప్రభుత్వం రెండు లక్షల రైతు రుణమాఫీ మహిళలకు 2500. 4000 ఆసరా పెన్షన్ ఇస్తేనే ప్రజలు కాంగ్రెస్ కి ఓట్లు వేస్తారని చెప్పారు ఒకవేళ అవన్నీ అమలు చేయని పక్షంలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం కచ్చితంగా అన్నారు. హామీల మీద ప్రశ్నిస్తే పాలన చేతకాక ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు