హిస్టరీ క్రియేట్ చేసిన జకోవిచ్‌.. 23వ గ్రాండ్‌ స్లామ్‌తో రికార్డు

-

టెన్నిస్‌ సూపర్ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) మరోసారి హిస్టరీ క్రియేట్ చేస్తారు. జకోవిచ్ తన కెరీర్‌లో 23వ గ్రాండ్‌ స్లామ్‌ గెలిచి రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో 7-6, 6-3, 7-5 తేడాతో కాస్పర్‌ రూడ్‌ (నార్వే)ను ఓడించి టైటిల్‌ను సాధించాడు. ఈ విజయంతో రఫెల్‌ నాదల్‌ (22) పేరిట ఉన్న రికార్డును జకోవిచ్‌ అధిగమించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 33 సార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరిన జ‌కోవిచ్.. 23 సార్లు విజేత‌గా నిలిచాడు. జకోవిచ్‌ ఇప్పటివరకు 10 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, 3 యూఎస్‌ ఓపెన్‌, 3 ఫ్రెంచ్‌ ఓపెన్‌, 7 వింబుల్డన్‌ టైటిళ్లను సొంతం చేసుకున్నాడు.

త‌న రికార్డును బ‌ద్ధ‌లు కొట్టిన అత‌డికి రఫాల్​ నాద‌ల్ అభినంద‌నలు తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్​వేదికగా పోస్టు పెట్టారు. అందులో ” ఈ ఘనత సాధించినందుకు అభినందనలు. కొన్నేళ్ల క్రితం 23 అనేది ఒక సంఖ్య మాత్ర‌మే. ఆ మార్క్ అందుకోవ‌డం అసాధ్యం అనిపించేది. కానీ, నువ్వు ఈ రోజు 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించావు. ఈ విజయాన్ని నీ కుటుంబ సభ్యులతో, జట్టుతో ఎంజాయ్​ చెయ్​” అని నాద‌ల్ రాసుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version