పారిస్‌ పారాఒలింపిక్స్‌కు షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ దూరం

-

టోక్యో పారా ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో గోల్డ్ మెడల్ సాధించిన భారత స్టార్ షట్లర్ ప్రమోద్‌ భగత్‌పై ఈ ఒలింపిక్స్లో సస్పెన్షన్‌ వేటు పడింది. అతడిపై 18 నెలలపాటు సస్పెన్షన్‌ విధిస్తున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్‌ ప్రకటించింది. డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

బీడబ్ల్యూఎఫ్ నిర్ణయంతో ప్రమోద్‌ 2024 పారిస్ పారాలింపిక్స్‌కు దూరం కానున్నాడు. ప్రమోద్ను 12 నెలల వ్యవధిలో మూడు సార్లు డోపింగ్ పరీక్ష కోసం రమ్మని కోరినా అతను హాజరు కాలేదని, గైర్హాజరుకు కారణాలు వెల్లడించడంలోనూ అతడు విఫలమయ్యాడని బీడబ్ల్యూఎఫ్‌ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించినందున మార్చి 1, 2024న అతడిని సస్పెండ్ చేసినట్లు చెప్పింది. తనపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని ప్రమోద్‌ కాస్‌ను అభ్యర్థించగా.. దీనిని 29 జూలై 2024న కాస్‌ కొట్టివేస్తూ డోపింగ్ నిరోధక విభాగం ఇచ్చిన తీర్పును సమర్థించిందని వెల్లడించింది. ఇక ప్రమోద్‌ భగత్‌ టోక్యో పారాలింపిక్స్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3 కేటగిరీలో పోటీ పడి ఫైనల్‌లో డేనియల్ బెథెల్‌ (బ్రిటన్‌)ను ఓడించి భారత్కు గోల్డ్ మెడల్ అందించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version