పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు తొలి పతకం దక్కింది. 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్‌కు షూటింగ్ విభాగంలో పతకం తెచ్చిపెట్టిన బాకర్‌ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమెకు ఫోన్ చేసి అభినందించారు. మను బాకర్- మోదీ మధ్య ఫోన్ సంభాషణ సాగిందిలా..
మోదీ: మను.. నమస్తే. కంగ్రాట్యులేషన్స్
మను: థాంక్యూ సర్. ఎలా ఉన్నారు?
మోదీ: మీరు విజయం సాధించారన్న వార్త విన్న తర్వాత ఉత్సాహం, ఆనందంతో ఉప్పొంగుతున్నాను
మోదీ: రజతం చేజారినప్పటికీ.. మీరు మన దేశం పేరును నిలబెట్టారు. మీకు రెండు విధాలా క్రెడిట్ దక్కుతోంది. ఒకటి కాంస్యం సాధించడం. రెండు.. ఈ విభాగంలో పతకం తీసుకొచ్చిన తొలి మహిళ మీరే కావడం.
మను: థాంక్యూ సర్
మోదీ: ప్రారంభమే ఇంత బాగుంది. దీంతో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తోటి క్రీడాకారులు అందరూ సౌకర్యంగానే ఉన్నారా?
మను: అవును సర్. అందరూ ఆనందంగా ఉన్నారు.
మోదీ: మన క్రీడాకారులకు అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేం కూడా అన్ని చర్యలు తీసుకున్నాం.
మను: అన్ని బాగున్నాయి సర్.