తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్న ప్రజ్ఞానంద .. ఈసారి రెండో ర్యాంకర్‌కు ఝలక్

-

భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద అంతర్జాతీయ టోర్నీలో చెలరేగిపోతున్నాడు. నార్వే చెస్‌ టోర్నీలో ఈ సంచలన ఆటగాడు తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల మూడో రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్‌ కార్ల్‌సన్‌కు ఓటమి రుచి చూపించిన ఈ యువ గ్రాండ్‌మాస్టర్‌.. తాజాగా అయిదో రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఫాబియానో కరువానా (అమెరికా)పై విజయం సాధించాడు. ఓ క్లాసికల్‌ చెస్‌ టోర్నీలో ప్రపంచ టాప్‌-2 ర్యాంకర్లను ప్రజ్ఞానంద తొలిసారి ఓడించాడు.

ఆఖర్లో కరువానాతో గేమ్‌ డ్రాగా ముగిసేలా కనిపించింది. కానీ 66వ ఎత్తులో కరువానా తప్పిదాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ప్రజ్ఞానంద. అలా మరో 11 ఎత్తుల్లోనే విజయాన్ని అందుకున్నాడు. ఈ గెలుపుతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రజ్ఞానంద టాప్‌-10లోకి వచ్చాడు. ప్రత్యక్ష ర్యాంకింగ్స్‌లో 2754.7 ఎలో రేటింగ్‌ పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. అయిదు రౌండ్లు పూర్తయేసరికి నకముర (10), కార్ల్‌సన్‌ (9), ప్రజ్ఞానంద (8.5) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version