యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీపై ప్రధాని మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. చిన్న వయసులో ఐపీఎల్ లో అద్భుతంగా ఆడుతున్నాడని కితాబు ఇచ్చారు. ఖోలో ఇండియా యూత్ గేమ్స్ ను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోడీ.

దేశంలో స్పోర్ట్స్ కల్చర్ పెరుగుతోందన్న ప్రధాని మోడీ… యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి బిహార్ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో కేవలం 35 బంతుల్లోనే శతకం సాధించి, ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన శతకం నమోదు చేసిన వైభవ్ ప్రతిభను గుర్తించిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయనకు రూ. 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు.