IPL 2025: కోల్‌కతాకు షాకిచింది పంజాబ్.. చివరి క్షణంలో విజయం సాధించింది పంజాబ్. కోల్‌కతాతో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. 112 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన KKR 95 రన్స్‌కే ఆలౌట్ అయ్యింది.

పంజాబ్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్ మూడు, జేవియర్ బార్ట్‌లెట్, అర్షదీప్ సింగ్, మాక్స్‌వెల్ తలో వికెట్ తీశారు. KKR బ్యాటింగ్‌లో రఘువంశీ మినహా మిగతా బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు.
ఇది ఇలా ఉండగా, IPLలో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. కోల్‌కతాతో మంగళ వారం జరిగిన మ్యాచ్‌లో 112 స్కోరును డిఫెండ్ చేసుకుని IPLలో చరిత్రలో అతి తక్కువ స్కోరు చేసి గెలుపొందిన జట్టుగా రికార్డు కెక్కింది. గతంలో ఈ రికార్డు చెన్నై పేరిట ఉండేది. 2009లో పంజాబ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 116 స్కోరును చెన్నై డిఫెండ్ చేసుకుని విజయం సాధించింది.