గత మ్యాచ్ లో పంజాబ్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పై 245 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ లో SRH జట్టు ఘన విజయం సాధించింది. ఇవాళ కేకేఆర్ పై పంజాబ్ కింగ్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కి షాక్ తగిలిందనే చెప్పాలి. టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ఆ జట్టు 11 ఓవర్లలోనే 86 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. దీంతో పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఓపెనర్లు ప్రియాశ్ 22, ప్రభ్ సిమ్రాన్ 30 చేయగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఇంగ్లీషు 2, వధేరా 2, మ్యాక్సివెల్ 7 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కోల్ కతా బౌలర్లలో హర్షిత్ 3, వరుణ్ 2, నరైన్ 2, నోర్తుజే 1, వైభవ్ అరోరా 1 వికెట్ తీశారు. బార్ట్లెట్ రన్ అయ్యాడు. దీంతో 15.3 ఓవర్లలో పంజాబ్ 111 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. కోల్ కతా 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.