నాకు రూ.5 కోట్ల బోనస్‌ వద్దు.. రాహుల్ ద్రవిడ్ కీలక నిర్ణయం

-

భారత ప్రధాన కోచ్‌గా పని చేసిన రాహుల్ ద్రవిడ్ తన బోనస్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత కోచ్‌గా వ్యవహరించిన ద్రవిడ్‌ పదవీ కాలాన్ని ఘనంగా ముగించారు. టీ20 వరల్డ్ కప్ను టీమిండియా ముద్దాడిన వేళ బీసీసీఐ రూ.125 కోట్ల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. స్క్వాడ్‌లోని 15 మంది ప్లేయర్లకు రూ.5 కోట్లు చొప్పున.. రిజర్వ్‌ ఆటగాళ్లకు రూ. కోటి చొప్పున అందించింది. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్‌ ద్రవిడ్‌కూ రూ.5 కోట్ల బోనస్‌ దక్కింది.

బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్‌ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఒక్కొక్కరికి రూ.2.5 కోట్లను ప్రకటించింది. దీంతో తనను ప్రత్యేకంగా చూడటంపై ఇబ్బంది పడిన రాహుల్ ద్రవిడ్.. తన బోనస్‌ను సగానికి తగ్గించుకోవాలని భావిస్తున్నాడని తెలిసింది. అందరికీ సమానంగా బోనస్‌ అందించాలని కోరినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. రాహుల్ సెంటిమెంట్ను గౌరవిస్తామని బీసీసీఐ అధికారిక వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version